మీ పిల్లల చదువు బాధ్యత మేం తీసుకుంటాం
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:06 PM
మీ పిల్లలను చదివించే బాధ్యత తాము తీసుకుంటామని, ఇంటికొచ్చిన పిల్లలతో తల్లిదండ్రులుగా పాఠశాలలో ఏం నేర్చుకున్నారన్న విషయాలను అడగాలని ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. లేదంటే వారు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మీ పిల్లలను చదివించే బాధ్యత తాము తీసుకుంటామని, ఇంటికొచ్చిన పిల్లలతో తల్లిదండ్రులుగా పాఠశాలలో ఏం నేర్చుకున్నారన్న విషయాలను అడగాలని ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. లేదంటే వారు పక్కదారి పట్టే ప్రమాదం ఉందన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శత శాతం కార్యక్రమానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆత్మీయ స మ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము చదివే రోజుల్లో టీవీ, సెల్‌ఫోన్, గంజాయి, సిగరెట్ వంటివి లే వని, ఇప్పుడు అవన్నీ మన ఊరు మధ్యకొచ్చా యని అన్నారు. వాటికి బానిసలు కాకుండా చా లా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంటర్ వరకు విద్యార్థులను మంచి మార్గంలోకి తీసుకెళ్తే భవిష్యత్తు చదువులు వాళ్లే చూసుకుంటారన్నారు. ఈ ఇరవై నెలల కాలంలో బెస్ట్ కాలేజీలను హై దరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు తె చ్చామని, మరో పాలిటెక్నిక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ చదువులు తెస్తామన్నారు. హైదరాబాద్‌లో చదివే పిల్లలకు మన పిల్లలు తీసిపోరన్నారు. వారికి సరైన అవకాశం, ప్రోత్సాహం, మార్గం చూపిస్తే హైదరాబాద్ పిల్లలకన్నా అద్భుతంగా చదువుతారన్నారు. సమావేశంలో వందేమాతరం ఫౌండర్ రవీందర్, నాయకులు వినోద్‌కుమార్, సిరాజ్‌ఖాద్రి, సీఎంఓ బాలుయాదవ్ ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ పాల్గొన్నారు.