Share News

గోరక్షకుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:52 PM

అక్ర మంగా తరలిస్తున్న ఆవులను అడ్డుకునే ప్రయ త్నం చేసిన గోరక్షకుడు సోను సింగ్‌పై కొందరు దుండగులు చేసిన కాల్పుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నా రాయణ అన్నారు.

గోరక్షకుడిపై  దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

వనపర్తి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : అక్ర మంగా తరలిస్తున్న ఆవులను అడ్డుకునే ప్రయ త్నం చేసిన గోరక్షకుడు సోను సింగ్‌పై కొందరు దుండగులు చేసిన కాల్పుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నా రాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఎలాంటి అనుమతులు లేకుండా కొంత కా లంగా రాష్ట్రంలో ఓ వర్గానికి చెందిన కొందరు దుండగులు అక్రమంగా ఆవులను తరలిస్తున్నా రని మండిపడ్డారు. ఇలాంటి వాటిని అడ్డుకునేం దుకు కొంత మంది యువత ముందుకు వస్తే అలాంటి వారిపై దాడులకు దిగడం బాధకరమ న్నారు. ఆ దాడిలో గాయపడ్డ గోరక్షకుడు సోను సింగ్‌ను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంట్‌, శాసన సభ్యులను ఎక్క డికక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నట్లు తెలిపారు. ఇందుకు నిరసనగా నేడు జి ల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో ధర్నా కార్య క్రమం చేపట్టడంతో పాటు, కలెక్టరేట్‌కి ర్యాలీ వె ళ్లి మెమోరాండం అందజేయడం జరుగుతుంద ని తెలిపారు. కార్యక్రమానికి గోరక్షకులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు.

Updated Date - Oct 23 , 2025 | 11:52 PM