హిందూ ధర్మస్థాపనకు కృషి చేయాలి
ABN , Publish Date - May 11 , 2025 | 11:19 PM
హిందూ ధర్మస్థాపనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, దైవారాధన ఉన్నప్పుడే మనుషులలో ఆలోచన పరిపక్వతను పెంచుతుందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అన్నారు.
- ప్రత్యేక పూజలు చేసిన చినజీయర్ స్వామి
- కొండపల్లిలో ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠ
- అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
గద్వాల/మల్దకల్, మే 11 (ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మస్థాపనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, దైవారాధన ఉన్నప్పుడే మనుషులలో ఆలోచన పరిపక్వతను పెంచుతుందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి అన్నారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కొండప ల్లి గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వి నాయక, పార్వతీ పరమేశ్వర, సీతారామాంజనేయ, నవగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆధ్యాత్మికం అంటే మన జీవన విధానంలో ఇమిడి ఉండేదని, ప్రతీ ఒక్కరు ప్రతి అంశలో దైవత్వాన్ని చూడటం అనేది మన ఆలోచన పరిపక్వతను చాటుతుందని చినజీయర్ స్వామి వివరించారు. సమాజం పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలని ప్రజలు తమ పాత్రను బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు. అంతకుముందు చినజీయర్ స్వామికి ఘనంగా ప్రజలు స్వాగతం పలికారు. నేరుగా ఆలయంలోకి చేరిన ఆయన సార్వతీ పరమేశ్వర స్వామికి, సీతారామాంజనేయకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన గంటపాటు ప్రవచనాలను ప్రజలకు వివరించారు.
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠలు
కాగా ఆలయంలో గత మూడు రోజుల నుంచి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున నుంచే వేదపారాయణలు, కుంబారాధనలు, ప్రాణ ప్రతిష్ఠాంగ హోమాలు ని ర్వహించి స్వాతి నక్షత్ర యుక్త వృషభలగ్న సుముహూర్తంలో పార్వతీ పరమేశ్వరులు, సీతారామాంజనేయ స్వామి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ప్రా ణ ప్రతిష్ఠ హోమాలు నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయారు. ఈ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. మధ్యాహ్నం గద్వాల కాంగ్రెస్ ఇన్‌చార్జి సరిత, మునిసిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్‌లు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
అమరవాయిని సందర్శించిన చినజీయర్ స్వామి
మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలోని భక్తుడు వెంకటేశ్వ ర రెడ్డి నివాసంలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామికి పాదపూజ నిర్వహించారు. అదే విధంగా ఆదిశిలా క్షేత్రం మల్దకల్ స్వయంభూ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ పట్వారి ప్ర హ్లాద రావు స్వామీజీకి తిమ్మప్ప స్వామి చరిత్ర పుస్తకం అందజేసి ఘనంగా సన్మానించి ఆలయాన్ని సందర్శించాలని కోరారు. అందుకు స్వామీజీ సరమై సమయంలో దేవాలయానికి వస్తానని తెలిపారు. భక్తులు స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు