సమాజ చైతన్యానికి కృషి చేయాలి
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:35 PM
ప్ర జలను చైతన్యపరచే విధంగా జిల్లాలో కార్యక్ర మాలను నిర్వహించి సమాజ చైతన్యానికి కళా కారులు కృషి చేయాలని ప్రజా నాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
గద్వాల టౌన్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ప్ర జలను చైతన్యపరచే విధంగా జిల్లాలో కార్యక్ర మాలను నిర్వహించి సమాజ చైతన్యానికి కళా కారులు కృషి చేయాలని ప్రజా నాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాల్మీకి కమిటీ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు అలీఅక్బర్ ఆ ధ్వర్యంలో గద్వాల జిల్లా ప్రజానాట్య మండలి జిల్లాకమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అలంపూర్‌లో నిర్వహించి న శౌర్యయాత్ర, బాలోత్సవం వంటి గత కార్య క్రమాలకు సంబంధించిన అంశాలను ప్రజానా ట్య మండలి జిల్లా కార్యదర్శి ఆశన్న వివరించా రు.భవిష్యత్ కార్యక్రమాల్లో భాగంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొనే కార్మికులకు , రైతులకు, కూలీలకు మద్దతుగా పాటలు ఆల పించేందుకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టులో విద్యార్థులకు సాంస్కృ తిక కార్యక్రమాలను మండల కేంద్రాల్లో నిర్వహి స్తామన్నారు. జానపద వృత్తి కళాకారులకు, ఆధ్యాత్మిక రంగంలో భజన కళాకారులకు, సాం స్కృతిక రంగాల కళాకారులందరికీ ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాం డ్ చేశారు. భవిష్యత్ కార్యక్రమాలను నిర్వహిం చేందుకు జిల్లాలోని ప్రజానాట్య మండలి కళాకారులందరూ కృషి చేయాలని జిల్లా అధ్య క్షుడు అలీఅక్బర్ కోరారు. సమావేశంలో పీఎన్ ఎం జిల్లా సహాయ కార్యదర్శిలక్ష్మీ, ఉపాధ్యక్షు డు వి.నరసింహ, అభిరామ్, జిల్లా నాయకులు తిమ్మప్ప ఉన్నారు.