Share News

అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలి

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:47 PM

దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా ని లిచి వారికి సహాయ, సహకారాలు అందిం చాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు జిలెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు.

అన్నం పెట్టే రైతుకు అండగా నిలవాలి

ఆత్మకూరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా ని లిచి వారికి సహాయ, సహకారాలు అందిం చాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు జిలెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఇటీవ ల కాలంలో నూతనంగా మార్కెట్‌ చైర్మన్‌ గా ఎంపికైన రహమతుల్లా ప్రమాణ స్వీ కారానికి హాజరు కాలేనందున ఆదివారం ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌లో ఆయ న్ను ఽఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీలో కుల మతాలకు వర్గ విభేదాలకు తావుండదని పని చేసిన వారికే పార్టీ పట్టం కట్టడం ఖాయ మన్నారు. అందులో భాగంగానే దశాబ్దాల కా లం నుంచి రహమతుల్లా పార్టీ అభివృద్ధికి కృషి చేసినందుకు గాను పార్టీ ఆయనకు మార్కెట్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించిందని తెలిపారు. తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ఉ చిత వ్యవసాయ విద్యుత్‌ రైతు భరోసా కింటా లుకు రూ.500 బోనస్‌ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి రైతు ప్రభుత్వంగా నిలిచిందని ఆ యన మరోసారి గుర్తు చేశారు. అలాగే ఈ ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ సలహాలు సూచనలు అందించి వారి సంక్షేమం కోసం కృ షి చేయాలని ఆదేశించారు. వనపర్తి జిల్లా కాం గ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, రాయచూ రు పరమేష్‌ నాయకులు, అశోక్‌, దామోదర్‌, తిరుమలేష్‌, ప్రకాష్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:47 PM