Share News

రహదారుల విస్తరణకు సహకరించాలి

ABN , Publish Date - May 30 , 2025 | 11:34 PM

వనపర్తి పట్టణ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రహదా రుల విస్తరణకు సహకరిం చాలని ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి కోరారు.

రహదారుల విస్తరణకు సహకరించాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

- ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మే 30 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి పట్టణ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రహదా రుల విస్తరణకు సహకరిం చాలని ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి కోరారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పో తున్న వ్యాపార సంస్థల య జమానులతో శుక్రవారం క లెక్టరేట్‌ సమావేశ మందిరం లో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వనపర్తి పట్టణం నుంచి పెబ్బే రు, పాన్‌గల్‌ రహదారి విస్తరణకు సంబంధించి వ్యాపారస్తులను ఇళ్ల యజ మానులను ఇబ్బంది పెట్టి రోడ్డు విస్తరణ చేపట్టదలుచుకోలేదన్నారు. రోడ్డు విస్తరణను యజమానులను ఒప్పించి తగిన నష్టపరిహారం ఇచ్చి విస్తరణ మాత్రం తప్పకుండా జరుగుతుందన్నారు. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ... గత పదేళ్లలో వనపర్తి పట్టణ జనా భా రెండింతలు అయిందని, రాబోయే రోజుల్లో నాలుగింతలు కావచ్చన్నారు. జనాభాకు భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా రోడ్లు ఉండాలని అన్నారు. అద నపు కలెక్టర్‌ లోకల్‌ బాడీస్‌ ఇన్‌చార్జి యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ముని సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, తహసీల్దార్‌ రమేష్‌ రెడ్డి, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 11:34 PM