Share News

స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:31 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి
అప్పంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

- పార్టీ శ్రేణులకు దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పిలుపు

చిన్నచింతకుంట, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, మాట్లాడారు. ఇల్లు లేని అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని, అందులో భాగంగానే విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు అయ్యాయని, ఇవి పూర్తైన వెంటనే మరో 1000 ఇళ్లు మంజూరు అవుతాయని తెలిపారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రాఘవెందర్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, మణివర్ధన్‌రెడ్డి, పోలీస్‌ రాఘవరెడ్డి, శాంతిరెడ్డి, దేవేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

విద్యాభివృద్ధికి పెద్దపీట

భూత్పూర్‌ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో భూత్పూర్‌ మండలం తాటికొండ, కొత్తమొల్గర, భూత్పూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఎమ్మెల్యేలు యన్నెం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది

దేవరకద్ర : ఉపాధ్యాయుల వృత్తి పవిత్రమైందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని డోకూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్‌ కొండ దమయంతి, గోవర్ధన్‌రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం శ్రీనివాస గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని శాలువాతో సన్మానించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, ఎంఈవో బాల్‌రాం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:31 PM