Share News

గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:26 PM

ప్రతీ ఒక్కరూ ఐక్యతతో మెలుగుతూ కలిసి కట్టుగా ఉండి గ్రామ అభివృద్ధిలో భాగస్వాము లు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
పాల్వాయిలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- మల్దకల్‌ మండలం పాల్వాయిలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ

మల్దకల్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): గ్రామంలో ప్రతీ ఒక్కరూ ఐక్యతతో మెలుగుతూ కలిసి కట్టుగా ఉండి గ్రామ అభివృద్ధిలో భాగస్వాము లు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మల్దకల్‌ మండలంలోని పాల్వాయి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు కో సం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై భూమిపూ జ చేశారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే, గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసు కోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్య క్రమంలో జడ్పీమాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ, జిల్లా సీనియర్‌ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి, మాజీ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ వీరన్న, మాజీ సర్పంచు శివరాంరెడ్డి నాయకులు సీతా రాంరెడ్డి, అజయ్‌, వెంకటన్న, కురుమన్న, జీవన్‌ రెడ్డి, ఎల్లప్ప, రంజిత్‌, మహేష్‌, వీరేశ్‌, కార్యక ర్తలు ఉన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:26 PM