Share News

స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Oct 01 , 2025 | 10:57 PM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వదేశీ ఉద్యమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కా వాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

స్వదేశీ ఉద్యమంలో భాగస్వాములు కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ప్రసాద్‌

గద్వాల టౌన్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వదేశీ ఉద్యమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కా వాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై ఆధారపడే విధానానికి వీలైనంత త్వరగా ముగింపు పలక డమే ప్రధాని ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సేవాపక్షం కార్యక్ర మాల్లో భాగంగా బుధవారం గద్వాలలోని డీకే బంగ్లాలో విద్యావంతులు, మేధావుల సదస్సు నిర్వహించారు. సదస్సులో మాట్లాడిన భరత్‌ ప్రసాద్‌, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్‌ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నుల స్లాబ్‌ లను ఐదు నుంచి రెండింటికి తగ్గించిందని తెలి పారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు కలుగుతు న్న ఆర్థిక ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాల ని పార్టీ శ్రేణులను కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, స్థానిక ఎన్నికల ఇన్‌చార్జి రామచంద్రా రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్యాంరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 10:57 PM