Share News

ఆధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:36 PM

విద్యా ర్థులు ఆధునిక విద్యా ప్రమాణాలతో ముందు కెళ్లాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి అన్నారు.

ఆధునిక విద్యా ప్రమాణాలతో ముందుకెళ్లాలి
మాట్లాడుతున్న బాలకృష్ణారెడ్డి

- రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి

తెలకపల్లి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులు ఆధునిక విద్యా ప్రమాణాలతో ముందు కెళ్లాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలంలోని సీఎల్‌ ఆర్‌ విద్యా సంస్థలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు లకు కావాల్సిన వసతులను కలెక్టర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం బీఈడీ విద్యార్థులకు నూతన విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. అంతకు ముందు బాలకృష్ణారెడ్డిని, కలెక్టర్‌ను విద్యాసంస్థ యాజ మాన్యం ఘనంగా సన్మానించి జ్ఞాపికను అంద జేశారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి సభ్యులు శివరావు, రాధాకృష్ణ, డాక్టర్‌ కామరాజు, మధుసూదన్‌రెడ్డి, తహసీల్దార్‌ జాకీర్‌ఆలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:36 PM