అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలవాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:33 PM
గద్వాల మండల పరిధిలోని వీరాపురం గ్రామ సర్పంచు నీలం మ హేశ్వరి గెలుపొందగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శాలువా, పూలబొకేతో సన్మానించారు.
సర్పంచు, వార్డు సభ్యులను సన్మానించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం స్ధానిక సంస్థ ల ఎన్నికల సందర్భంగా గద్వాల మండల పరిధిలోని వీరాపురం గ్రామ సర్పంచు నీలం మ హేశ్వరి గెలుపొందగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శాలువా, పూలబొకేతో సన్మానించారు. అలాగే వార్డు సభ్యులను అభినందించి, సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచుగా మీపై నమ్మకంతో గెలిపించిన ప్రజ ల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేశ్ నాయుడు, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, కురుమన్న ఉన్నా రు. అలాగే కే.టి.దొడ్డి మండలం పూజారితాండ గ్రామంలో సర్పంచుగా ఎన్నికైనా రాజునాయక్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. కార్య క్రమంలో మాజీ జడ్పీటీసీ రాజశేఖర్, నాయకులు ఉరుకుందు, ఉన్నారు.