ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:31 PM
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్ లక్మీనారాయణ అన్నారు.
రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్ లక్మీనారాయణ అన్నారు. మంగళవారం గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళిపై ప్రతీ గ్రా మంలో ఆయా రాజకీయ పార్టీలకు చెంది న కనీసం ఒక్కో కార్యకర్తకైనా అవగాహన కలిగించాలన్నారు. ప్రభుత్వ భవనాలు, ఆస్తులపై రాజకీయ ప్రచారాలకు సంబంధించి ఎలాంటి రాతలు రాయకూడదని, పోస్టర్లు అతికించరాదన్నారు. ప్రైవేట్ భవనాలపై సైతం ఏమైనా పోస్టర్లు అతికిస్తే సంబంధిత యజమానుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అధికారులను అడిగితే తెలియజేస్తారన్నారు. ఎలాంటి ఘర్ణణకు తావు లేకుండా ప్రశాంతవాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు సహకరించేలా ఆయా పార్టీల నాయకులు కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీపీవో నాగేంద్రం, పలురాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.