Share News

నేరాల నియంత్రణలో సఫలీకృతమవ్వాలి

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:39 PM

జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను నియంత్రణలో సఫలీకృతం అవ్వాలని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు.

నేరాల నియంత్రణలో సఫలీకృతమవ్వాలి
ఆయుధాలకు గుమ్మడి కాయ కొట్టి పూజ చేస్తున్న వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్‌

జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ, వాహన పూజలో ఎస్పీ రావుల గిరిధర్‌

వనపర్తి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) :జిల్లా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను నియంత్రణలో సఫలీకృతం అవ్వాలని ఎస్పీ రావుల గిరిధర్‌ అన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవా లలో భాగంగా మంగళవారం ఆయన సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ఆయుధ, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో నేరాలను నియంత్రించడంలో జిల్లా పోలీస్‌ శాఖ సఫలీకృ తం అవ్వాలని దుర్గామాత కరుణాకటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేలా దుర్గామాత అశీస్సులు ఉండాలని కోరారు. ఎస్పీ పోలీసు అధి కారులకు, సిబ్బందికి ప్రజలకు వారి వారి జీవితా లలో ఈ విజయ దశమి శాంతి సౌభాగ్యాలను అందించాలని దసరా పండుగ శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో ఎస్పీ సతీమణి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యురాలు బండి అపర్ణ, వనపర్తి సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, వనపర్తి సీఐ కృష్ణయ్య, కొత్తకోట సీఐ రాంబాబు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేశ్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:39 PM