Share News

హత్యా రాజకీయాలు మానుకోవాలి

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:36 PM

మాజీ సర్పంచ్‌ చిన్న భీమరాయుడు మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నా యని, నిందితులు ఎంతటివారైనా చట్టపర మైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాల ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ గొంగళ్ళ రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

హత్యా రాజకీయాలు మానుకోవాలి
చిన్న భీమరాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తున్న రంజిత్‌కుమార్‌

కేటీదొడ్డి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మం డలంలోని నందిన్నె గ్రామానికి చెంది న మాజీ సర్పంచ్‌ చిన్న భీమరాయుడు మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నా యని, నిందితులు ఎంతటివారైనా చట్టపర మైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాల ని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ గొంగళ్ళ రంజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నందిన్నె గ్రామంలో ని మాజీ సర్పంచ్‌ చిన్న భీమరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడ్లి వారికి మనోధైర్యం కల్పించారు. పూర్తి వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ బుచ్చిబాబు, వెంకట్రాములు, సుభాస్‌, తిమ్మప్ప, సుదర్శన్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:36 PM