Share News

ప్రతీ గింజను కొంటాం

ABN , Publish Date - Apr 15 , 2025 | 10:50 PM

రైతులు పండించిన ప్రతీ చివరి గింజను కొంటామని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

ప్రతీ గింజను కొంటాం
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

దేవరకద్ర, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన ప్రతీ చివరి గింజను కొంటామని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నాగారం, దేవరకద్ర మార్కెట్‌ యార్డులో ప్రాథమిక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మాట్లాడారు. రైతులు దళారులకు విక్రయించి నష్టపోరాదని, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్‌ కూడా ఇస్తుందన్నారు. టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ కతలప్ప, వైస్‌ చైర్మన్‌ హన్మంతురెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్‌ వేణగోపాల్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, పాల్గొన్నారు.

సహకారం సంఘంలోనే విక్రయించాలి

భూత్పూర్‌ : రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా సమకార సంఘంలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సహకార సంఘం అధ్యక్షుడు కదిరె అశోక్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వెల్కిచర్ల, పాతమొల్గర గ్రామాల్లో సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యుజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు భూపతిరెడ్డి, మాజీ సర్పంచ్‌ హర్యానాయక్‌, ఏవో మురళిధర్‌, నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతులు రాంరెడ్డి, తమ్మన్నగౌడ్‌, అచ్చన్న, పాల్గొన్నారు.

గండీడ్‌ : మండలంలోని పెద్దవార్వల్‌, బల్సుర్‌గొండ గ్రామాల్లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, మాట్లాడారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు నరసింహరావు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, మానిటరింగ్‌ అఽధికారి వీరభద్రయ్య, సీఈవో ఆశన్న, బాలస్వామి, కొండారెడ్డి, ఏఈవోలు శివలీల, గౌతమి పాల్గొన్నారు.

మిడ్జిల్‌ : మండలంలోని మసిగుండ్లపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్‌ తంగెళ్ల జ్యోతి అల్వాల్‌రెడ్డి మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి చెందిన పలువురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. మార్కెట్‌ డైరెక్టర్లు సత్యంగౌడ్‌, బంగారయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గౌస్‌, మాజీ సర్పంచ్‌లు సుమతమ్మ గోపాల్‌రెడ్డి, చెన్నయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 10:50 PM