Share News

ప్రజాపాలనలో డిక్లరేషన్‌ అమలు చేస్తున్నాం

ABN , Publish Date - May 02 , 2025 | 11:35 PM

We are implementing the Declaration in public administration.

ప్రజాపాలనలో డిక్లరేషన్‌ అమలు చేస్తున్నాం
క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడుతున్న నాయకులు

- డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

వనపర్తి టౌన్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): అసెం బ్లీ ఎన్నికల ముందు వరంగల్‌, కామారెడ్డిలో ఇ చ్చిన డిక్లరేషన్‌లను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ లు చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ చౌరస్తాలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు వి ద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రకా రం 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెం బ్లీలో తీర్మాణం చేసిన మొదటి రాష్ట్రం మనదే నన్నారు. అసెంబ్లీ తీర్మాణాన్ని గవర్నర్‌కు పం పించి, ఆమోద ముద్రతో కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. కులగణన పూర్తి చేయడమే కా కుండా, ఎస్సీ వర్గీకరణ కూడా అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణేనన్నారు. కార్యక్రమం లో కదిరె రాములు, చీర్ల జనార్ధన్‌, ఎండీ బాబా, రాగివేణు, కోళ్ల వెంకటేష్‌, జానకిరాములు, పెం టన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 11:35 PM