వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ బోల్తా : వ్యక్తి మృతి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:22 PM
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజోలి మం డల కేంద్రంలో చోటు చేసుకుంది.
రాజోలి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజోలి మం డల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గో కారి తెలిపిన వివరా ల ప్రకారం.. మండల కేంద్రమైన రాజోలి గ్రామానికి చెందిన పింజరి నడిపి శాలు(47) తన సొంత ట్రాక్టర్‌కు వాటర్‌ట్యాంకు తగిలించుకుని ముండ్లదిన్నె గ్రామంలో శుభకార్యానికి అని వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. చుట్టుపక్కల పొలాల్లో ఉన్న కూలీలు గమనించి సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్టర్ కింద పడి ఉన్న వ్యక్తిని బయటకి లాగారు. మృతుడు నడిపిశాలు అని గుర్తించారు. వా రి కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అక్కడికి చేరుకొని పరిశీలించగా ట్రాక్టర్ మృతుడిపై పడటంతో ఉపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు.