Share News

ఊకచెట్టు వాగులోకి నీటిని విడుదల చేయాలి

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:12 PM

ఊకచెట్టు వాగుకు పర్దీపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా నీటిని విడుదల చేయాలని బీజేపీ జిల్లా నాయకులు నంబి రాజు, కుర్వ రమేష్‌ పేర్కొన్నారు.

ఊకచెట్టు వాగులోకి నీటిని విడుదల చేయాలి
విలేకరుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

చిన్నచింతకుంట, జూలై14 (ఆంధ్రజ్యోతి) : ఊకచెట్టు వాగుకు పర్దీపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా నీటిని విడుదల చేయాలని బీజేపీ జిల్లా నాయకులు నంబి రాజు, కుర్వ రమేష్‌ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎగువ నుంచి వచ్చిన వరదలు జూరాలను నింపిన కూడా మన అధికారులు మాత్రం వచ్చిన జలాలను ఉపయోగించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాలకు వరదలు వచ్చి 50 రోజులు అవుతున్నా.. పర్దీపూర్‌ రిజర్వాయర్‌ను నింపి దాని ద్వారా ఊక చెట్టు వాగులోకి వదలాల్సి ఉండగా ఇంత వరకు నీటిని వదలలేదని తెలిపారు. ఊకచెట్టు వాగుపై ఆధారపడి రైతులు, శివారు ప్రాంతాల్లోని ప్రజలకు సాగు, తాగు నీరు కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మూడు రోజుల్లో ఊకచెట్టు వాగులోకి నీరు వదలాలని లేనికుంటే సీసీకుంట, దేవరకద్ర మండలాల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో రైతుల పక్షాన లాల్‌కోట క్రాస్‌ రోడ్డు లేదా, సీసీకుంట తహసీల్దార్‌ కార్యాలయం దిగ్భంధం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నరసింహ యాదవ్‌, జలీల్‌, లంకాల రవి, వికాస్‌, నరసింహ, మైను, మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:12 PM