కోయిల్‌సాగర్‌కు నీటి విడుదల
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:15 PM
జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్‌సాగర్‌కు నీటిని దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు జీ.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి సోమవారం రాత్రి విడుదల చేశారు. మండలంలోని ఉంద్యాల ఫేజ్-1 పంప్‌హౌస్ ద్వారా నీటిని వదిలారు.
పూజలు చేసి ప్రారంభించిన ఎమ్మెల్యేలు జీఎంఆర్, శ్రీహరి
చిన్నచింతకుంట/నర్వ, జూన్ 2(ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు నుంచి కోయిల్‌సాగర్‌కు నీటిని దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు జీ.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి సోమవారం రాత్రి విడుదల చేశారు. మండలంలోని ఉంద్యాల ఫేజ్-1 పంప్‌హౌస్ ద్వారా నీటిని వదిలారు. అంతకు ముందు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఎలాగైతే ప్రకృతి సహకరించి, రైతులు సంతోషంగా ఉన్నారో ఇప్పడు కూడా సీఎం రేవంత్‌రెడ్డి పాలనలోనూ ప్రకృతి స హకరిస్తుందన్నారు. కృష్ణానది పరివాహక ప్రాం తంలో వర్షాలు కురవడంతో జూన్ మొదటి వారంలోనే కోయిల్‌సాగర్‌కు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రజాపాలనలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ ప్రతా్‌పసింగ్, డీఈ నమియోద్దీన్, ఏఈఈ జాకీర్ హుస్సేన్, నాయకులు పాల్గొన్నారు.