రైతులకు పూర్తిస్థాయిలో నీరందించాలి
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:29 PM
నెట్టెంపాడు ద్వారా ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరందించాలని జాగృతి రాష్ట్ర అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.
జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
ధరూరు/గట్టు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నెట్టెంపాడు ద్వారా ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నీరందించాలని జాగృతి రాష్ట్ర అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని సోమవారం కవిత సందర్శించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది, నీరందడంలేదన్న విషయాలను స్థానిక అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలు సుకున్నారు. ఆయకట్టుకు సంబంధించి పూర్తిస్థా యిలో నీరందాలని తెలిపారు. అనంతరం స్థాని క నెట్టెంపాడు లిఫ్ట్‌పై కూడా వివరాలు తెలుసు కున్నారు. ఇరవై గ్రామాలకు పైగా రాకపోకలు సాగుతున్న గుడ్డెందొడ్డి వద్ద కెనాల్‌పై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వాన్ని కవిత డి మాండ్ చేశారు. గుడ్డెందొడ్డి కస్తూర్బా పాఠశాలను సందర్శించి, మెనూ ప్రకారం భోజనాన్ని అందిస్తున్నారా లేది అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.
గట్టు ఎత్తిపోతల పనులపై ఆరా
గట్టు ఎత్తిపోతల పనులు ఏ మేరకు జరిగాయి? రిజర్వాయర్ కెపాసిటీ ఎంత? రైతులకు చెల్లించాల్సిన భూ పరిహారం వివరాలపై కవిత ఆరా తీశారు. భూము ల సేకరణ, కాల్వల నిర్మాణం గురించి పలువురు రైతులతో మాట్లాడారు. భూపరిహారాన్ని రైతులకు తెలియకుండా కాజేసిన విషయాన్ని రైతులు తెలిపారు. అక్కడి నుంచి ఆలూరు గ్రామానికెళ్తానన్నారు. ఆమె వెంట ఎన్‌హెచ్‌పీఎస్ అధ్యక్షుడు రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు.