వరంగల్ సభను జయప్రదం చేయాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:29 PM
తెలం గాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత మా జీ సీఎం కేసీఆర్‌దేనని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
పాన్‌గల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : తెలం గాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత మా జీ సీఎం కేసీఆర్‌దేనని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వరంగల్ లో నిర్వహించే రజతోత్సవ సభను బీఆర్‌ఎస్ కా ర్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ప్రజలకు అందుబాటు లో ఉండేలా, అనేక సంక్షేమ పథకాలు తీసుకొ చ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. అబద్దపు మా టలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. శ్రీధర్ రెడ్డి, రాంచందర్ యాదవ్ పాల్గొన్నారు.