వైద్యుల కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Sep 08 , 2025 | 10:52 PM
అలంపూరు చౌరస్తాలోని వందపడకల ఆసుపత్రికి వై ద్యులే సమయానికి రావడంలేదని రోగులు వాపోతున్నారు.
- వంద పడకల ఆస్పత్రిలో తలుపులు మూసి రోగుల నిరసన
అలంపూరుచౌరస్తా, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అలంపూరు చౌరస్తాలోని వందపడకల ఆసుపత్రికి సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రోగులు క్యూ కడుతున్నారు. దీంతో రోజుకు సుమారు 150దాక ఓపీలు వస్తున్నాయి. సోమవారం 70మంది అ డ్మిట్ అయిన రోగులు ఉన్నారు. కానీ వై ద్యులే సమయానికి రావడంలేదని రోగులు వాపోతున్నారు. సోమవారం ఉదయం ఓపీలు తీసుకున్నాక గంటల తరబడి డాక్టర్ల కోసం వేచి చూసినా రాలేదని కొందరు రోగులు ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రి తలుపులు మూశారు. దీంతో అక్కడే ఉన్న చిన్నపోతులపాడు మాజీ ఎంపీటీసీ శేఖర్ కల్పించుకుని రోగులను వారిం చి తలుపులు తెరిచారు. విషయం తెలుసుకున్న ఆంధ్రజ్యోతి అక్కడికి వెళ్లి రోగులతో మాట్లాడగా ఓపీ తీసుకుని గంటల తరబడి వేచి చూసినా వైద్యులు రావడంలేదని వివిధ గ్రామాల నుంచి వచ్చిన రోగులు తెలిపారు. ఉదయం 10:15 గంటలకు కంటి డాక్టర్ దివ్య ఒక్కరే విధులకు హాజరయ్యారు. ఈ విషయమై డిప్యూటీ ఆర్‌ఎంవోకు ఆంధ్రజ్యోతి ఫోన్ చేయగా క్షణాల్లో వచ్చి రోగులను చూశారు. వచ్చేది ఆలస్యం మ ళ్లీ మధ్యాహ్నం వెళ్లిపోతున్నారని రోగులు అస హనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని స్టాఫ్ నర్సులు కొందరు, పర్యవేక్షణ కోసం వచ్చిన వైద్య విధాన పరిషత్ ఉమ్మడిజిల్లా సమన్వయ అధికారి డా. రమేశ్‌చంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఈవిషయంపై సీరియస్ అయ్యారు. తీసుకునే జీతం రోగుల సేవ కోసమేనని, వేళాపాల పా టించాలని ఆదేశించారు. ప్రారంభదశలో ఆసుప త్రికి ఆవసరమైన వైద్యులను ప్రభుత్వం కేటా యించినప్పటికీ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ను నియమించడం వల్ల పర్యవేక్షణ కొరవడిందని రోగులు అభిప్రాయపడుతున్నారు.
జీతం ఇక్కడ పని అక్కడ..
వంద పడకల ఆసుపత్రిలో సుమారు 30 మంది స్టాఫ్ నర్సులు అవసరం. కానీ ప్రస్తుతం 11మంది మాత్రమే ఉన్నారు. ఇందులో 5మంది సీనియర్ స్టాఫ్‌నర్సులు ఉన్నారు. అయితే ఆసు పత్రి ప్రారంభానికి ముందే ప్రభుత్వం స్టాఫ్‌న ర్సులను వివిధ శాఖల ఉద్యోగులను కేటాయిం చింది. ఆ సమయంలో స్టాఫ్ నర్సుల అవసరం లేకపోవడంతో అలంపూరు ఆసుపత్రికి పంపా రు. ఆసుపత్రి ప్రారంభమై రెండునెలలు కావ స్తోంది. శానిటేషన్ సిబ్బంది నియామకాలను ఓ ఏజెన్సీకి ఇచ్చారు. కానీ అధికారులు నేటికీ అలంపూరులో పనిచేసే అయిదు మంది నర్సు లు రప్పించలేదు. దీంతో ఇక్కడ ఉన్నవారిపైనే భారం పడుతున్నది.