Share News

జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:31 PM

గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని టీయూసీఐ రాష్ట్ర స హాయ కార్యదర్శి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు.

జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి
ఆందోళన చేపట్టిన కార్మికులు

పాలమూరు, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని టీయూసీఐ రాష్ట్ర స హాయ కార్యదర్శి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రగతి శీల గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా ఆయన మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు జీవో 60 ప్రకారం వేత నాలు పెంచాలని, పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని, గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రతీ నెలా జీతాలు ఇవ్వాలన్నారు. జీవో 51ని రద్దు చేయాలనే టోకెన్‌ సమ్మె చేపట్టినట్లు తెలిపారు. జీవో ప్రకారం రూ.15,600, రూ.19,500, రూ.22,750 చొప్పున మూడు కేటగిరీలుగా వేతనాలు పెంచాలన్నారు. వేసవిలో ఎండలు తీవ్రమవటంతో ఉదయం 11 గంటల వరకు పనిచేయించాలన్నారు. కార్మికుల సంఖ్యను పెంచి, మురికి పనులు చేస్తున్న వర్కర్లకు ప్రతీ నెల శానిటేషన్‌ వస్తువులు ఇవ్వాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌తో నేడు సమ్మె చేశామన్నారు. కుర్మయ్య, శేఖర్‌, వెంకట్రాములు, తిమ్మయ్య, రంగయ్య, చెన్నయ్య, చెన్నమ్మ, అంజ లిమ్మ, మణ్యం, కొండన్న, వెంకటేష్‌, టీయూసీఐ బాలు, శ్రీను, ఖాదర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 11:31 PM