Share News

గిరిజన హాస్టల్‌ కార్మికుల వేతనాలు పెంచాలి

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:00 PM

గిరిజన హాస్టల్స్‌లో పనిచేసే కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

గిరిజన హాస్టల్‌ కార్మికుల వేతనాలు పెంచాలి
హాస్టల్‌ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్న సీఐటీయూ నాయకులు

పాలమూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : గిరిజన హాస్టల్స్‌లో పనిచేసే కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం కార్మికులు చేస్తున్న దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. సమ్మెలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌ డైలివేజ్‌, కాంటినిజెంట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (జేఏసీ) ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న నిరవధిక దీక్షకు సీఐటీయూ మద్దతిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయమైంది, ఎంతోకాలం నుంచి పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేయాలని, టైం స్కేల్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, వారాంతపు సెలవులు, జాతీయ సెలవులు, దసరా, సంక్రాంతి, వేసవి సెలవులు, మిగతా హాస్టల్స్‌ వర్కర్స్‌ ఇస్తున్నట్లు ఇవ్వాలన్నారు. సమ్మెలో అనసూయ, లక్ష్మి, జ్యోతి, రుక్మిణి, స్వరూప, అనిత, భీమమ్మ, శ్రీలత, గణేష్‌, ఎల్లప్ప, అంజమ్మ, పద్మ ఉన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:00 PM