దేశంలో ప్రతీ చోట ఓటుచోరీ
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:18 PM
దేశంలో ప్రతీ చోట బీజేపీ ఓటు చోరీ చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
గోపాల్‌పేట, అక్టోంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రతీ చోట బీజేపీ ఓటు చోరీ చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని జయన్న తిరుమాలపూర్‌లో ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ హాజరై సంత కాలు సేకరించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశంలోనే ఓటు చోరీ చేసి మూడోసారి అధికారంలోని వచ్చిదని అన్నారు. ఎన్నికలు జరుగుతున్న బిహార్ రాష్ట్రంలో ఓట్లను బీజేపీ చోరీ చేస్తుందని రాహుల్ గాంధీ అధారాలతో నిరూపిం చారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జనార్దన్, రోహిత్, అక్షయ్, చరణ్‌రాజ్, శాంతన్న, హరిబాబు, ధర్మారెడ్డి, రాములు, రవి, కొండన్న, తదితరులు పాల్గొన్నారు.