Share News

వాలీబాల్‌ విజేత మహబూబ్‌నగర్‌

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:15 PM

మహబుబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం తిరుమలాపూర్‌ గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్‌-17 బాలికల వాలీబాల్‌ టోర్నమెంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ద్వితీయ స్థానంలో నిజామాబాద్‌, తృతీయ స్థానంలో ఖమ్మం జిల్లాల జట్లు నిలాచాయి.

వాలీబాల్‌ విజేత మహబూబ్‌నగర్‌
విజేత మహబూబ్‌నగర్‌ జట్టుకు షీల్డ్‌ అందిస్తున్న శాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

ముగిసిన రాష్ట్ర స్థాయి అండర్‌-17 బాలికల టోర్నీ

షీల్డ్‌ అందించిన స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనా రెడ్డి

రాజాపూర్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మహబుబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం తిరుమలాపూర్‌ గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్‌-17 బాలికల వాలీబాల్‌ టోర్నమెంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ద్వితీయ స్థానంలో నిజామాబాద్‌, తృతీయ స్థానంలో ఖమ్మం జిల్లాల జట్లు నిలాచాయి. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనా రెడ్డి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, విజేతలకు షీల్డ్‌ అందించారు. ఈ సందర్భంగా శాట్స్‌ చైర్మన్‌ శివసేనరెడ్డి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. విద్యార్థులను, క్రీడాకారులను ప్రోత్సహిచడం కోసం మైదానాలు ఏర్పటు చేస్తున్నారన్నారు. గెలుపొందిన జట్టు నవంబరు 13, 14, 15 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ శారదాబాయి తెలిపారు. కార్యక్రమంలో ఎంఈవో సుధాకర్‌, టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రాములు, మర్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ గౌడ్‌, యాదయ్య, వెంకటేష్‌, బచ్చిరెడ్డి, శివకుమార్‌, శ్రీనివా్‌సలు, సత్యం, యాదగిరి, టీజీ పీఈటీ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్‌, వ్యాయమ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 11:15 PM