మహిళలపై హింసను అరికట్టాలి
ABN , Publish Date - Mar 09 , 2025 | 11:26 PM
మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను అరికట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బా ల్‌రామ్, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలామణి డిమాండ్ చేశారు.
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్
నారాయణపేట, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను అరికట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బా ల్‌రామ్, ఆశ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలామణి డిమాండ్ చేశారు. ఆదివారం పట్ట ణంలోని మునిసిపల్ పార్కు వద్ద జరిగిన మ హిళా దినోత్సవం సభను ఉద్దేశించి మాట్లాడారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజనం, మెప్మా, ఆర్పీ, ఐకేపీ, వీవోఏ, ఉపాధి హామీ ప థకాలలో పనిచేస్తున్న మహిళలను ప్రభుత్వం శ్రమ దోపిడీకి గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత, సమానత్వం గు రించి గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, ముందు శ్రామిక మహిళల కనీస వేతనం 45వ లేబర్ కార్ఫరెన్స్ సిఫారసుల మేరకు రూ.26 వే లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మ ధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే రూ.3వేల వే తనంను రూ.పది వేలకు పెంచాలన్నారు. కార్య క్రమంలో రాధిక, మమత, పార్వతి, మున్వర్, నాంచారమ్మ, చంద్రకళ, భాగ్యమ్మ, సుశీలమ్మ త దితరులు పాల్గొన్నారు.
హక్కుల కోసం పోరాడాలి
మక్తల్ : దేశంలో రోజు రోజుకు స్త్రీలపై జరు గుతున్న అఘాయిత్యాలు అరికట్టాలని సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శ్రామిక మహిళా దినోత్సవం కార్య క్రమం నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మణిపూర్‌లో బాలికలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో దోషులకు శిక్ష పడలేదన్నారు. మహిళలు ఐక్యంగా ఉండి తమ హక్కులకోసం పోరాటం చేయాలన్నారు. గోవిం దరాజు, అమీనాబేగం, సుజాత, పార్వతమ్మ, వెంకటలక్ష్మి, మంజుల తదితరులు పాల్గొన్నారు.