Share News

నిఘా నీడలో గ్రామాలు

ABN , Publish Date - May 14 , 2025 | 11:14 PM

: ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తోంది.

నిఘా నీడలో గ్రామాలు
అమరచింత మండలం ఈర్లదిన్నెలో సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ సురేశ్‌

నేరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ప్రజలు

సత్ఫలితాలు ఇస్తున్న పోలీసుల కృషి

వనపర్తి, మే 14 (ఆంధ్రజ్యోతి) : ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తోంది. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా మారుతోంది. నిమిషాల వ్యవధిలోనే నిందితులను పట్టిస్తోంది. కాలానికి అనుగుణంగా టెక్నాలజీ స్పీడ్‌ అందుకోగా నేరాల ను సులభంగా ఛేదిస్తూ వనపర్తి పోలీసులు ప్రజల తో శభాష్‌ అనిపించుకుంటున్నారు. జిల్లా పోలీసు లు కమ్యునిటీ కాంటాక్ట్‌లో ప్రజలను భాగస్వా మ్యం చేస్తూ ప్రతీ గ్రామంలో నిఘా నేత్రం ఉండే లా అవగాహన కల్పిస్తున్నారు.

హై క్వాలిటీ కెమెరాలు

నేరాల నియంత్రణకు పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగా వ్యాపారులతో పాటు, ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేం దుకు వస్తున్నారు. ప్రస్తుతం 360 డిగ్రీల్లో తిరుగుతూ పరిసరాలు స్పష్టంగా రికార్డు అయ్యే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి విద్యుత్‌ సరఫరా లేని చోట బ్యాట రీలు, సోలార్‌ సిస్టంలతో కూడిన సీసీ కెమె రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో కిలో మీటర్ల దూరంలో ఉన్న తన దుకాణం, ఇంటి వద్ద ఏం జరుగుతుంది అనే విషయాన్ని తన చేతిలో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా లైవ్‌లో వీక్షించవచ్చు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 1,225 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో పోలీసులు ఈ సీసీ కెమెరాలను ప్రధాన చౌరస్తా లు, బస్టాండ్‌ వంటి ప్రాంతాలలోనే ఏర్పాటు చేసేవారు. కానీ ప్రస్తుతం గ్రామాలలోని ప్రధాన కూడళ్లు, వ్యాపార దుకాణాల సముదాయాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

నిర్వహ ణే అసలు సమస్య ..

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉంది. కానీ వాటి నిర్వహణను పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా చోట్ల నిరుప యోగంగా మారాయి. ముఖ్యంగా గ్రామాల్లో కోతు లు సీసీ కెమెరాల వైర్లను తెంపడం ప్రధాన సమస్యగా మారింది. చాలా గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండగా వాటిని పట్టించుకోవడం లేదని పోలీసుల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని కూడా వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 14 , 2025 | 11:14 PM