Share News

సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పల్లెలు

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:16 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిం చాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి పిలుపునిచ్చారు.

సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పల్లెలు
సమావేశమైన బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాంరెడ్డి

కృష్ణ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిం చాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మాగనూరు మండలంలోని వర్కూరు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ము ఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పా ర్టీ రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రజలకు అమలు కానీ ఆరు గ్యారెంటీలు, హామీలు ఇచ్చి అన్ని వ ర్గాల ప్రజలకు మోసం చేసిందన్నారు. గ్రామాల అభివృద్ధి గాలికి వదిలేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నేరుగా పంచా యతీలకు నిధులు ఇచ్చి అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అధికారంలో ఉండి రెండేళ్లు గడు స్తున్నా పల్లెల్లో తాగునీటి సమస్యలు, గుంతలు పడ్డ బీటీ రోడ్లు, అంతర్గత రహదారులు లేక ప్ర జలు కొట్టుమిట్లాడుత్తున్నా పాలకులకు కనపిం చడం లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జ యానంద్‌ రెడ్డి, వాకిటి మల్లేష్‌, కనకరాజు, తి మ్మప్ప, అంజప్ప గౌడ్‌, హనుమంత్‌, వెంకటప్ప, నాగప్ప, ప్రతాప్‌రెడ్డి, బుగ్గప్ప, తాయప్ప, వాకిటి చంద్రశేఖర్‌, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:16 PM