కాంగ్రెస్‌తోనే గ్రామాభివృద్ధి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:17 PM
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామ ని గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని చూస్తు న్నామని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్ అన్నారు.
మహబూబ్‌నగర్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎ న్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామ ని గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని చూస్తు న్నామని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్‌ముదిరాజ్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించుకుంటే గ్రా మాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశా రు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపిం చుకోవాలని, ఎవరు గెలిస్తే ఊరు అభివృద్ధి చెం దుతుందో ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరా రు. బలవంతంగా ఎక్కడా ఏకగ్రీవాల కోసం కాంగ్రెస్ వేలం పాట, బెదిరింపులకు పాల్పడ టం లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న పుకార్లను ప్ర జలు నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ త రపున జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తుందన్నారు. రానున్న మూడే ళ్ల కాలంలో పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని ప్రజలు ఆలోచించాలన్నారు. నా యకులు జహీర్‌అక్తర్, చంద్రకుమార్‌గౌడ్, వ సంత, సీజే బెనహర్, లింగంనాయక్, బెక్కరి మధుసూదన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ఫయాజ్, అజ్మ త్‌అలీ, అవేజ్, రాములుయాదవ్ పాల్గొన్నారు.