అంబరాన్నంటిన విజయ దశమి సంబురాలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:28 PM
జిల్లాలో విజయ దశమి వేడుకలు అంబరాన్నంటాయి. శరన్నవరాత్రుల చివరి రోజు ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
గద్వాలలో చెన్నకేశవుడిని దర్శించుకున్న సంస్థానవారసుడు
గద్వాల టౌన్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విజయ దశమి వేడుకలు అంబరాన్నంటాయి. శరన్నవరాత్రుల చివరి రోజు ప్రజలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. దసరా పండుగ ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపి కొత్త విజయాలను సాధించిపెట్టాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహ న్ రెడ్డి ఆకాంక్షించారు. గద్వాల పట్టణంలోని తేరు మైదానం సమీపంలో గల చారిత్రక గుంటి చెన్నకేశవస్వామి ఆలయం వద్ద గల పురాతన శమీ వృక్షానికి వేలసంఖ్యలో భక్తులు పూజ లు నిర్వహించి, ప్రదక్షిణలు చేశారు. శమీ శమయతే పాపం... శమీ శత్రువినాశిని.. అర్జునస్య ధనుర్ధారి... రామస్య ప్రియదర్శి ని అనే మంత్రాలు ఆలయ పరిసరాల్లో మారుమోగాయి. ఆ లయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జ్యోతి దంపతులు ప్రత్యేక పూజల అనంతరం జమ్మిచెట్టుకు ప్రదక్షి ణలు చేశారు. ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని కాళికాదేవి, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో అమ్మవారికి పూజలు నిర్వహించగా కుమ్మరి సంఘం ఆధ్వ ర్యంలో దుర్గాదేవి శోభాయాత్రలు స్థానిక గుంటి చెన్నకేశవస్వా మి ఆలయం వరకు నిర్వహించారు. స్థానిక కోటలోని భూలక్ష్మి చెన్నకేశవస్వామి ఆలయాన్ని విజయదశమి సందర్బంగా సం దర్శించిన సంస్థాన వారసుడు కృష్ణరాంభూపాల్ స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక గుంటి చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద పురాతన శమీ వృక్షానికి పూజలు చేశా రు. తొలిసారి ఆలయానికి వచ్చిన సంస్థాన వారసుడికి గ ద్వాల ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు బండల వెంకట్రా ములు, రిటైర్డ్ డీవైఎస్‌వో జితేందర్, మాజీ కౌన్సిలర్ బండల పాండు ఘన స్వాగతం పలికారు.