వర్టికల్ ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:25 PM
పోలీస్ స్టేషన్లకు వచ్చే వర్టికల్ ఫిర్యాదులు తక్షణం పరిష్కరించేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలని వర్టికల్ డీఎస్పీ సుదర్శన్ సూచించారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ స్టేషన్లకు వచ్చే వర్టికల్ ఫిర్యాదులు తక్షణం పరిష్కరించేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలని వర్టికల్ డీఎస్పీ సుదర్శన్ సూచించారు. గురువారం జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో పెండింగ్ పిటిషన్‌లు క్లోజ్ చేయడంపై నూతన ఆపరేటర్స్‌కు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఫిర్యాదులు రికార్డు చేయడం, లేదా సంబంధిత అధికారికి బదిలీ చేయాలన్నారు. సీసీటీఎన్‌ఎస్ నందు సరియైున సమయానికి ఫిర్యాదును అప్‌డేట్ చేయాలన్నారు. నమోదు, సందర్శకుల రిజిస్టర్‌ను క్రమంగా నమోదు చేయాలన్నారు. వ్యక్తిగత, సున్నితమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, స్టేషన్‌కు వచ్చే వివాదాల్లో మధ్యవర్తిత్వం చేయకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.