వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:59 PM
గద్వాల పట్టణంలోని భీం నగర్‌లో వెలసిన సంతాన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
- రాజవంశీయుల ప్రత్యేక పూజలు
గద్వాల టౌన్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గద్వాల పట్టణంలోని భీం నగర్‌లో వెలసిన సంతాన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గద్వాల సంస్థాన వారసులు ఆధ్వర్యంలో నిర్మాణమైన శ్రీసంతాన వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా మార్గశిర బహుళ షష్టి నుంచి మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవాల ప్రారంభం సందర్బంగా ఆలయంలో అర్చకులు మొదటి రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అ నంతరం పుణ్యాహవచనం, అంకురారోపణం, ధ్వజారోహణం, భేరీపూజ, హోమాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. రాజవంశీయులు ఉషారాణి, వెంకటాద్రిరెడ్డి దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు.
వైభవంగా కల్యాణోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణం నిర్వహించారు. రాజవంశీయులు గద్వాల వెంకటా ద్రి రెడ్డి, ఉషారాణి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణోత్సవాన్ని తి లకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధా న ఘట్టమైన రథోత్సవం గురువారం రాత్రి నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.