బలహీన వర్గాల ఆపన్నహస్తం వెంకటస్వామి
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:30 PM
కేంద్ర మంత్రిగా దివంగత గడ్డం వెంకటస్వామి బడుగు, బలహీన వర్గాలకు విశేషమైన సేవలు చేశారని తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దూమర్ల నిరంజన్ అన్నారు.
పాలమూరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర మంత్రిగా దివంగత గడ్డం వెంకటస్వామి బడుగు, బలహీన వర్గాలకు విశేషమైన సేవలు చేశారని తెలంగాణ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దూమర్ల నిరంజన్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గడ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించి, మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 75 వేల మందికి పక్కా ఇళ్లు నిర్మించారని, ఏక కాలంలో 100కు పైగా సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేశారన్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వివిధ కార్మిక రంగాల్లో పినిచేసిన కార్మికులకు పెన్షన్ ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు బండి రమాకాంత్ మాట్లాడుతూ సమాజానికి ఎనలేని సేవలు అందించిన వెంకటస్వామిని (కాకా) స్మరించుకోవటం గర్వంగా ఉందన్నారు. దళితులు అభివృద్ధి చెందటానికి తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంఘం ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్, కోశాధికారి ఆంజనేయులు, లీగల్ అడ్వైజర్ కృష్ణ, సభ్యులు మనోహర్, మహేష్ పాల్గొన్నారు.