పేట ఎస్‌ఈగా వెంకటరమణ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:07 PM
నారాయణపేట జిల్లా విద్యుత్ ఎస్‌ఈగా వెంకటరమణ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

నారాయణపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా విద్యుత్ ఎస్‌ఈగా వెంకటరమణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లో డీఈగా పని చేస్తున్న ఆయన పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. బుధవారం ఆయన కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డిలను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు అందించారు. ఎస్‌ఈ వెంట ఆపరేషన్ డీఈ నర్సింగ్‌రావు, ఏడీ శ్రీనివాస్, ఏఈ మహేష్‌గౌడ్ తదితరులున్నారు.