ప్రతీ ఒక్కరికి ఆదర్శనీయుడు వాల్మీకి
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:14 PM
రామాయణం రచనతో వాల్మీకి ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
గద్వాలన్యూటౌన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రామాయణం రచనతో వాల్మీకి ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్బంగా మంగళవారం గద్వాల కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పిం చారు. అనంతరం మాట్లాడుతూ రామాయణం మనిషి నైతిక విలువలతో జీవించడానికి దోహదపడుతుందన్నారు. అనంతరం కొమరంబీమ్ వ ర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, అధికారులు ఉన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
గద్వాల క్రైం: జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళిఅర్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.శంకర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి సతీష్, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
క్యాంపు కార్యాలయంలో
గద్వాల న్యూటౌన్ : జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వా ల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూల మాలలు వేసి, పూజలు నిర్వహించి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు గడ్డంకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ పీ విజయ్, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.