వైభవోపేతం · పాలమూరులో కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:33 PM
మహబూబ్‌నగర్ నగరపా లక సంస్థ పరిధిలోని ఎనుగొండ దేవుని గు ట్టపై నూతనంగా నిర్మించిన గౌడ జాతి ఆ రాధ్య దేవం సురమాంబ సమేత కంఠమ హేశ్వర స్వామి, వనం ఎల్లమ్మ, వనం మైస మ్మల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి.
- పెద్దసంఖ్యలో తరలివచ్చిన గౌడ కులస్థులు
- ప్రత్యేక ఆకర్షణగా జోగిని శ్యామల
- ఉత్సాహంగా బోనాల ఊరేగింపు
- బోనాల వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ మధుయాష్కి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్ న్యూటౌన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ నగరపా లక సంస్థ పరిధిలోని ఎనుగొండ దేవుని గు ట్టపై నూతనంగా నిర్మించిన గౌడ జాతి ఆ రాధ్య దేవం సురమాంబ సమేత కంఠమ హేశ్వర స్వామి, వనం ఎల్లమ్మ, వనం మైస మ్మల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. సూర్యాపేట జిల్లా నిమికల్ నుంచి ప్రత్యేకం గా విచ్చేసిన గౌడ పూజారి కౌండిన్య బా సంపల్లి యాదగిరి పంతులు ఆధ్వర్యంలో వే దపండితుల శాస్త్రోక్తంగా పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా నవగ్రహాది హోమం, అ ష్టదిక్పాకుల హోమంలతో పాటు విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి, పంచామృత అభిషేకం, జలాభిషేకాలు నిర్వహించారు. గౌడ కుటుం బాలతో పాటు సమీప కాలనీలోని భక్తులు బిందెలతో నీళ్లను తీసుకవచ్చి అభిషేకం చే శారు. ఉతయం నిర్వ హించిన అఖండ హోమంలో భక్తులు పెద్దఎత్తున సంప్ర దాయ దుస్తులలో పాల్గొన్నారు. పలు గ్రామాల నుంచి కల్లుగీత పారిశ్రామిక సంఘాలు డప్పు వా యిద్యాలతో ఆలయా నికి చేరుకున్నారు. కంఠమహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉదయం జరి గిన అఖండ హోమంతో పాటు, ప్రాణ ప్రతిష్ఠ పూజలో సతీసమేతంగా పాల్గొని పూ జలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యు లు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ టీపీసీసీ సంయుక్త కార్యాదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ ఎల్లగౌడ్, జిల్లా పెన్షన ర్ల సంఘం అధ్యక్షుడు సాయిల్‌గౌడ్, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్తూర్ వెంకటస్వామి గౌడ్, కార్యదర్శి యా దగిరి గౌడ్, రాజయ్యగౌడ్, గ్రేట్ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, సత్యనారా యణ గౌడ్, వెంకట్రాములు గౌడ్, బాలరా జు గౌడ్, చక్రవర్తి గౌడ్, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి గుముడాల నరేందర్ గౌడ్, కలాల్ రవి, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నా యకుడు చెరుకు శాంతి భూషన్ గౌడ్‌లతో పాటు, గీత పారిశ్రామిక సంఘాల సభ్యు లు, విశ్రాంత ఉద్యోగులు, గౌడ కులస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎల్లమ్మ తల్లి బోనాలకు పోటెత్తిన భక్తజనం
కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రారం భోత్సవం సందర్భంగా శుక్రవారం సా యంత్రం ఎల్లమ్మ తల్లి బోనాలు ఎనుగొం డలోని ఆంజనేయ స్వామి ఆలయం నుం చి దేవుని గుట్టవరకు ఊరేగింపు నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూ పల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ, ఏఐసీసీ నా యకుడు మధుయాష్కి గౌడ్ పాల్గొన్నా రు. హైదరాబాద్‌కు చెందిన జోగిని శ్యా మల బోనమెత్తి నృత్యం చేస్తూ ఊరేగిం పులో ముందుకు సాగారు. ప్రతీ గౌడ కు టుంబం నుంచి మహిళలు ఎల్లమ్మ, మైస మ్మ తల్లులకు బోనాలు ఎత్తారు. పోతురా జులు విన్యాసాలు చేశారు. ఎనుగొండ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి దేవు ని గుట్ట వరకు ఊరేగింపు సాగింది. మా ర్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత రె డ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.