Share News

వృత్యంతర శిక్షణను వినియోగించుకోవాలి

ABN , Publish Date - May 16 , 2025 | 11:31 PM

వృత్యంతర శిక్షణను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఉపాధ్యాయులను కోరారు.

వృత్యంతర శిక్షణను వినియోగించుకోవాలి
ఉపాధ్యాయుల శిక్షణలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- నేటి శిక్షణ కార్యక్రమాలను రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతిబింబించాలి

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేటటౌన్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): వృత్యంతర శిక్షణను వినియోగించుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఉపాధ్యాయులను కోరారు. జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ వృత్యంతర శిక్షణకు హాజరైన కలెక్టర్‌ ఉపాధ్యాయులనుద్ధేశించి మాట్లాడారు. రాష్ట్ర స్థా యిలో పొందిన శిక్షణను తరగతి గదికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఉపాధ్యాయులంతా తరగతి గదికి నిత్య నూతనంగా వెళ్లాలని సూచించారు. విద్యార్థుల నమోదుతో పాటు గుణాత్మక విద్యలో సమూల మార్పులు తెచ్చి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు. డీఎంహెచ్‌వో మోహన్‌ ఉపాధ్యాయులకు ఇచ్చిన ప్రేరణాత్మక సందేశాన్ని మెచ్చుకున్నారు. నారాయణపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు శిక్షణ శిబిరంలో మానవ అక్రమ రవా ణాకు సంబంధించిన పలు విషయాలను, అం దుకు గల కారణాలను, వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సీఐ శివ శంకర్‌ ట్రాఫిక్‌ రూల్స్‌, మాదక ద్రవ్యాల నివారణపై ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు నిత్య జీవితంలో జరిగే పలు ఉదాహరణల ద్వారా వివరించారు. మక్తల్‌ సీఐ రాంలాల్‌ సైబర్‌ క్రైమ్‌ గురించి పీపీటీల ద్వారా ప్రజెంటేషన్‌ ఇస్తూ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, కోర్సు పరిశీలకులు, గద్వాల డీఈవో మహమ్మద్‌ సిరాజ్‌, సీఎంవో రాజేంద్రకుమార్‌, ఏఎంవో విద్యాసాగర్‌, బాలాజీ, బాలకృష్ణ, వివిధ సబ్జెక్టుల డీఆర్పీలు పాల్గొన్నారు.

లక్ష్యాలకు అనుగుణంగా ప్రగతి సాధించాలి

నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రగతి సాధించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.జయచంద్రమోహన్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డా.శైలజ, పోగ్రాం అధికారులు, కోఆర్డినేటర్లతో ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాబోయే వర్షాకా లంలో పరిసరాల పరిశుభ్రత, నీటి ద్వారా ప్రబలే వ్యాధుల సంక్రమణ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే క్షయ, లెప్రసీ, మలేరియా, ఎన్‌సీడీ వంటి వ్యాధుల నివారణకు ప్రతీ పోగ్రాం అధికారి దృష్టి సారించాలని సూ చించారు. హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లు ఎన్ని ఉన్నాయి, పూర్తయిన నిర్మాణాలు, నిర్మాణ దశలో ఎన్ని ఉన్నాయి మొదలైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సుదేష్ణ, డాక్టర్‌ అనూష, పోగ్రాం కోఆర్డినేటర్‌ అశోక్‌కుమార్‌, ఎంపీహెచ్‌ఈవోలు విజయ్‌కు మార్‌, గోవిందరాజు, డీపీవో భిక్షపతి, ఎన్కోస్‌ క్వాలిటీ మేనేజర్‌ గౌతమ్‌, టీబీ సూపర్‌వైజర్‌ శ్రీధర్‌, ఎల్డీ కంప్యూటర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:31 PM