Share News

మాడల్‌గా ఉరూ ్ధఘర్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 10:45 PM

మహబూబ్‌నగర్‌లో ఉర్ధూఘర్‌ తెలంగాణలోనే ఒక మాడల్‌గా నిలువనుందని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ అన్నారు. జిల్లా కేంద్రంలో ఉర్ధూ ఘర్‌ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి షబ్బీర్‌అలీ సోమవారం శంకుస్థాపన చేశారు.

మాడల్‌గా ఉరూ ్ధఘర్‌
ఉర్ధూ ఘర్‌కు శంకుస్థాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, చిత్రంలో ఎమ్మెల్యే యెన్నం, మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ తదితరులు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్‌ షబ్బీర్‌అలీ

జిల్లా కేంద్రంలో శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌లో ఉర్ధూఘర్‌ తెలంగాణలోనే ఒక మాడల్‌గా నిలువనుందని, దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ అన్నారు. జిల్లా కేంద్రంలో ఉర్ధూ ఘర్‌ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, పలువురు కార్పొరేషన్ల చైర్మన్లతో కలిసి షబ్బీర్‌అలీ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో అధునాతమైన ఉర్ధూ ఘర్‌ నిర్మాణం అవుతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తేవాలంటే చాలా కష్టమని, హిమాలయ పర్వతంలోని అంచువరకు ఎక్కొచ్చుగాని ప్రభుత్వం నుంచి డబ్బులు తేవడం కష్టమని అన్నారు. ఇది తన అనుభవపూర్వకంగా చెబుతున్నానని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం రూ.50 కోట్లు, అందులో రూ.15 కోట్లతో ఉర్ధూ ఘర్‌ నిర్మిస్తున్నందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. అందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివా్‌సరెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కృషి ఎంతో ఉందన్నారు. పదో తరగతి వరకు చాలా మంది మైనారిటీ విద్యార్థులు ఉర్ధూ తీసుకోవడం లేదన్నారు. దీంతో కళాశాలల్లో ఉర్ధూ చదివే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కులగణన చేపట్టడం చారిత్రాత్మకమన్నారు. ముస్లీం మైనారిటీల జ నాభా 12.58 శాతంగా ఉన్నట్లు తెలిపారు. ఎవరిది ఎంత జనాభా ఉందో వారికి అంత ప్రాతినిధ్యం నినాదాంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం ఉర్ధూలో మాట్లాడి ఆకట్టుకున్నారు. ఈ రోజు మహబూబ్‌నగర్‌లో చరిత్రలో మరుపురాని రోజు అని, ఎన్నో ఏళ్ల నుంచి ఉర్ధూ ఘర్‌ నిర్మించుకోవాలనే కల నెరవేరుతుందని చెప్పారు. చదువును మన జీవితంలో భాగం చేసుకోవాలని, చదువుతో బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ ఉర్ధూ ఘర్‌ మనలోని ఐక్యతకు చిహ్నమన్నారు. ఐదు అంతస్తులలో సమావేశ మందిరాలు, కల్చరర్‌, రీసెర్చ్‌ సెంటర్‌, లైబ్రరీ ఏర్పాటు, దూరప్రాంతాల నుంచి వచ్చే అతిథుల కోసం ఏర్పాట్లు, భోజనశాల ఉంటాయని చెప్పారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మైనారిటీల సంక్షేమ కోసం సీఎంతో మాట్లాడి రూ.45 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. రూ.5 కోట్లతో మౌలాలిగుట్టలో శ్మశానవాటిక నిర్మిస్తామని అన్నారు. వక్ఫ్‌బోర్డు నుంచి జహంగీర్‌పీర్‌ ఐటీఐ కళాశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేని, ఉర్ధూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హమ్దన్‌, రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ అప్జల్‌ బియమాని, ఎంఎల్‌సీ అమేర్‌అలీ ఖాన్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో టీమిరీస్‌ చైర్మన్‌ ఫహియోద్దీన్‌ ఖురేషి, మైనారిటీ గురుకులాల కార్యదర్శి షఫీవుల్లా, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మల్లు నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:12 PM