Share News

యూరియా కేటాయించాలి

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:01 AM

జడ్చర్ల నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా కేటాయింపు జరపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ గోపిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి కోరారు.

యూరియా కేటాయించాలి

- రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ గోపిని కలిసిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా కేటాయింపు జరపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ గోపిని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి కోరారు. ఆదివారం అసెంబ్లీలోని లాంజ్‌లో వ్యవసాయశాఖ కమిషనర్‌ గోపి, అడి షనల్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌లను కలిసి జడ్చర్ల నియోజకవర్గంలో యూరి యా కొరత గురించి వివరించారు. యూరియా అందక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. దీనికి స్పందించిన కమిషనర్‌ జడ్చర్ల నియోజకవర్గానికి యూరియాను అందచేస్తామని తెలిపారని ఎమ్మెల్యే చెప్పారు. యూరియా కొరతను నివారించేందుకు ఎమ్మెల్యే చర్యలు చేపడ్తుం డడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:01 AM