పేటలో తప్పని నీటి కొనుగోళ్లు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:13 PM
దేవరకద్ర వద్ద మిష న్ భగీరథ పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు పూర్తి కావడంతో నీటి సరఫరా పంపింగ్ మంగళవారం ప్రారంభమైంది.

- ఐదు రోజులుగా నీరు లేక ప్రజల అవస్థ
- నేడు నీటి సరఫరా జరిగే అవకాశం
నారాయణపేట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): దేవరకద్ర వద్ద మిష న్ భగీరథ పైప్‌లైన్ లీకేజీల మరమ్మతులు పూర్తి కావడంతో నీటి సరఫరా పంపింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలోని 245 గ్రామాలతో పాటు, నారాయణపేట, మక్తల్ మునిసిపాలిటీల్లో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఇదే సమయంలో నారాయణపేట మండలంలోని సింగారం చౌరస్తా వద్ద నీటి సరఫరా పైప్‌లైన్ మరమ్మతులు మూడురోజుల పాటు మునిసిపల్ సిబ్బంది శ్రమించి మరమ్మతులు పూర్తి చేశారు. దేవరకద్ర దగ్గర లీకేజీ పనులు పూర్తి కావడంతో తాగునీటి సరఫరా పంపింగ్ పునః ప్రారంభం అయింది. బుధవారం నీటి సరాఫరా యదావిధిగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే మరమ్మతులతో గత ఐదు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో నీటి వ్యాపారం జోరందుకుంది. ఆటోల ద్వారా నీటి ట్యాంకర్లతో పాటు మినరల్ బాటల్ నీటిని కొంటూ ప్రజలు ఆర్థికంగా నష్టపోతూ తాగునీటి తంటాలు పడుతున్నారు.