Share News

యూనిటీ మార్చ్‌ విజయవంతం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:22 PM

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ‘యూనిటీ మార్చ్‌’ విజయ వంతమైంది.

యూనిటీ మార్చ్‌ విజయవంతం
యూనిటీ మార్చ్‌లో గుజరాత్‌ ఎంపీ పార్మర్‌ జశ్వంత్‌సిన్హ్‌, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ‘యూనిటీ మార్చ్‌’ విజయ వంతమైంది. ఈ కార్యక్రమానికి గుజరాత్‌ రాజ్యసభ సభ్యుడు పార్మర్‌ జశ్వంత్‌సిన్హ్‌, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ ముఖ్య అథితులు గా హాజరయ్యారు. శనివారం నాగర్‌ కర్నూల్‌ పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌ క్రీడా మైదానంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, బిర్సాముండా చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించి ముఖ్య అతిథులు యూనిటీ మార్చ్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, యువతనుద్దేశించి రాజ్యసభ సభ్యుడు పార్మర్‌ జశ్వంత్‌సిన్హ్‌ మాట్లాడా రు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలు, అ లాగే వందేమాతరం గీతం 150ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు త్రివేణి సంగమం లాంటి కార్యక్రమాలను నిర్వ హించుకుంటున్నట్లు ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యువతలో దేశభక్తి పెంపొందించేందుకు ఏక్‌ భారత్‌ ఆత్మ నిర్భర్‌ భారత్‌ భాగంగా ఐక్యత మార్చ్‌ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కలెక్ట ర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశ సమైక్యతకు ప్రతీక. 536 సంస్థానాలను ఏకం చేసి అఖండ భారతావనిని నిర్మించిన మహనీయుడని అన్నారు. హైదరాబాద్‌ సంస్థానం విలీనం లో కూడా ఆయన పాత్ర అమోఘమని అన్నారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ ఎమ్మె ల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ మహనీయుల ఆశయాలకనుగుణంగా యువతరం ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధికారి కోటనాయక్‌, జిల్లా యువజన సర్వీసుల అధికారి సీతారాంనాయక్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌కుమార్‌, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి వెంకట రమణ, డీఎంహెచ్‌వో రవినాయక్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జ్ఞాన శేఖర్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతి నిధులు, యువత, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:22 PM