Share News

కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్‌ వంతెన పనులు

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:10 PM

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాలు పూర్తిస్థాయిలో వాటి నివారణకు ఎన్‌హె చ్‌ఏఐ హైవే అథారిటీ ఆధ్వర్యంలో అండర్‌ వంతెన నిర్మాణాలు చేపడుతున్నారు.

కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్‌ వంతెన పనులు
జానంపేట వద్ద కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులు

మూసాపేట, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాలు పూర్తిస్థాయిలో వాటి నివారణకు ఎన్‌హె చ్‌ఏఐ హైవే అథారిటీ ఆధ్వర్యంలో అండర్‌ వంతెన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని జాతీయ రహదారి జానంపేట వద్ద పాత పెట్రోల్‌ పంపు స మీపంలో అండర్‌ గ్రౌండ్‌ వంతెన నిర్మాణం మంజూరైంది. దీంతో రెండు నెలలుగా వంతెన నిర్మాణ పనుల కోసం రోడ్డు ఇరు వైపులా చదును చేసి డ్రైనేజీతో పాటు సబ్‌రో డ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. జానంపేట గ్రామం మధ్యలో స్జేజీ వద్దనే వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు పట్టుపడినా.. రహదారి విస్తణాధికారుల సూచన ప్రకారం మంజూరు చేసిన చోటనే నిర్మాణం చేపడుతున్నారు. పాత వంతెన పాఠశాల ఎదుట ఉండటంతో కొంత దూరంలో కొత్త వంతెన నిర్మాణం చేపడుతున్నా మని అధికారులు తెలిపారు. వేముల స్టేజీ వద్ద అండర్‌ గ్రౌండ్‌ వంతెన నిర్మాణ పనులు ము మ్మరంగా కొనసాగుతుండగా, మరికొన్ని నెలల్లోనే పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేసి ఇబ్బందులు తలెత్తకుండా మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:10 PM