పోలీసు స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:12 PM
జిల్లా కేంద్రంలోని పట్టణ , సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లను జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
గద్వాల క్రైం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పట్టణ , సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లను జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట పట్టణ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పరిసరాలను, ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్‌రైటర్, టెక్‌టీమ్‌ను పరిశీలించారు. స్టేషన్‌లో రోజువారిగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, బీట్ డ్యూటీబుక్స్ తదితర రికార్డులను తనిఖీ చేశారు. గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి వివరాలను, మ్యాప్‌ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్‌లో ఎంతమంది సిబ్బంది ఉన్నారు. వారు ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుంచి నిత్యం ఎన్ని బ్లూకోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్క డ ఎన్ని బీట్స్ నడుస్తున్నాయని తెలుసుకొన్నా రు. ప్రాపర్‌గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరుగకుండా చూసుకోవాలని ఆదేశించా రు. విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కరించాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన కాలనీలలో పూర్తిసమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల స మస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటు వంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలన్నారు. అనంతరం రూరల్ పోలీస్ ఆవరణలో ఉన్న సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసారు. స్టేషన్‌లో 5ఎస్ అమలు చేయాలని, అ న్ని రికార్డులు క్రమపద్ధతిలో ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగిలయ్య, గద్వాల సీఐ టి. శ్రీను, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రవి, పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్ ఉన్నారు.
యూరియా సరఫరా కేంద్రం పరిశీలన
యూరియా సరఫరా కేంద్రాల్లో రైతులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన యూరియా సరఫరా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ప్ర భుత్వ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, గద్వాల సీఐ టి. శ్రీను, గద్వాల పట్టణ ఎస్‌ఐ కళ్యాణ్‌కుమార్, ఉన్నారు.