Share News

తగ్గని వరద ఉధృతి

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:26 PM

భారీ వర్షాలకు రెండు ప్రధాన రహదారులను కలిపే జూపల్లి-వంగూరు రోడ్డు పొంగిపొర్లే వాగులతో ప్రజలు సతమతమవుతున్నారు.

 తగ్గని వరద ఉధృతి
లోలెవల్‌ వంతెనపై ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు

- లోలెవల్‌ వంతెనపై భారీగా నీరు

- జూపల్లి - వంగూరు మధ్య నిలిచిపోయిన రాకపోకలు

వంగూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు రెండు ప్రధాన రహదారులను కలిపే జూపల్లి-వంగూరు రోడ్డు పొంగిపొర్లే వాగులతో ప్రజలు సతమతమవుతున్నారు. జూపల్లి నుంచి వంగూరు గేటు వెళ్లే ఈ రో డ్డులో ఉన్న లోలెవల్‌ వంతెనపై ఇంకా ఎగు వ నుంచి వచ్చే నీరు తగ్గక ఉధృతంగా ప్రవ హిస్తుంది. దీంతో వంతెన లేక రహదారిపై పారే వరదతో రాకపోకలు నిలిచిపోయి ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నా ప ట్టించుకునే వారే కరువయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

శంకుస్థాపనకే పరిమితమైన బీటీ రోడ్డు పనులు

వంగూరు గేటు నుంచి జూపల్లి వరకు బీ టీ రోడ్డుకు గాను రూ.9 కోట్లు మంజూర య్యాయి. 8 నెలల కిందట రోడ్డు పనులకు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి శంకుస్థాప న చేశారు. నేటికీ రోడ్డు పనులు జరుగక శం కుస్థాపనకే పరిమితమైంది. ప్రస్తుతం వర్షాల కు పూర్తిగా దెబ్బతిని రోడ్డుపై అడుగడుగునా మోకాళ్లలోతు గుంతలు ఏర్పడి నీరు నిలిచి ప్రమాదభరితంగా మారింది. వంతెన లేక వ ర్షాలకు వరద నీరు లోలెవల్‌ వంతెనపై ఉధృ తంగా ప్రవహిస్తోంది. ఈ రహదారి గుండా వంగూరు, జూపల్లి, తుమ్మలపల్లి గ్రామాల రైతులు, ప్రజలు నిత్యం తమ పనుల కోసం వెళ్లాల్సిన అవసరం ఉంది, కురిసిన భారీ వర్షాలకు లో లెవల్‌ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్ర వహిస్తుండటంతో రాకపోక లు నిలిచిపోయి ఆయా గ్రామాల ప్రజలకు తీవ్ర అంతరా యం కలుగుతుంది. ఇకనైనా అధికారులు వెంటనే బీటీ రోడ్డు పనులను ప్రా రంభించి, హైలెవల్‌ వంతెన ఏర్పాటు చేయాలని ప్రజ లు కోరుతున్నారు.

Updated Date - Nov 07 , 2025 | 11:26 PM