అక్షరాస్యత పెంచడానికే ఉల్లాస్
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:20 PM
సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు ఉల్లాస్ కార్యక్రమం తోడ్పడుతోందని డీఈవో ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
- డీఈవో ప్రవీణ్‌కుమార్
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు ఉల్లాస్ కార్యక్రమం తోడ్పడుతోందని డీఈవో ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో ఉల్లాస్ కార్యక్రమంపై మండల రిసోర్స్ పర్సన్స్‌కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈవో హాజరై మాట్లాడారు. 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులకు అక్షరాలు నేర్పేందుకు ఉల్లాస్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇందుకోసం గ్రామాల్లో స్వచ్ఛందంగా వలంటీర్లు బోధన చేయాలన్నారు. ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కీలకమని వయోజన విద్యా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈనెల 11వ తేదీలోపు గ్రామంలోని నిరక్షరాసులను గుర్తించి ఉల్లాస్ యాప్‌లో నమోదు చేయాలన్నారు. మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు తమ మండలాల్లోని టీచర్లకు అక్షర వికాసం పుస్తకంపై శిక్షణ ఇవ్వాలన్నారు. రిసోర్స్ పర్సన్స్ రవి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.