Share News

బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే రెండేళ్లు జైలుశిక్ష

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:03 PM

బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల్య వి వాహాలను నివారించడం అందరి కర్తవ్యమని జోగుళాంబ గద్వాల జిల్లా సంక్షేమాధికారి సునంద అన్నారు.

బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నిస్తే రెండేళ్లు జైలుశిక్ష

  • జోగుళాంబ గద్వాల జిల్లా సంక్షేమాధికారి సునంద

గద్వాల క్రైం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చేయడం నేరమని, బాల్య వి వాహాలను నివారించడం అందరి కర్తవ్యమని జోగుళాంబ గద్వాల జిల్లా సంక్షేమాధికారి సునంద అన్నారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆ ధ్వర్యంలో జాతీయ బాల్యవివాహ వ్యతిరేక దినోత్సవం సందర్బంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ బాల్య వివాహాల వ ల్ల జరిగే దుష్పరిణామాల గురించి ప్రతీ ఒక్క రికి అవగాహన ఉండాలన్నారు. బాల్య వివా హం చేసినా లేదా చేయడానికి ప్రయత్నించిన వారికి రెండు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పా టు రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు. బాల్యవివాహాల పట్ల విద్యార్ధులకు అవగాహన ఉండా లనే ఉద్దేశంతో వారికి బాల్యవివాహాలకు వ్యతిరేకంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలు, డ్రా యింగ్‌ కాంపిటేషన్‌, ఉపన్యాస పోటీలు, పాటల పోటీలు నిర్వహించారు. వీరిలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు శైల జ, డీఆర్‌డీఏ విభాగం వెంకటరావు, జిల్లా న్యాయసేవా విభాగం శ్రీనివాసులు, రాజేందర్‌, బాలల సంరక్షణ అధికారి నరసింహ, రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 11:03 PM