Share News

ఒకే గ్రామంలో ఇద్దరు ఉపసర్పంచులు..!

ABN , Publish Date - Dec 20 , 2025 | 11:10 PM

సాధారణంగా ప్రజా ఎన్నిక పదవి గ్రామానికి లేదా నియోజకవర్గానికి ఒ క్కటే ఉంటుంది. కానీ ఓ గ్రామంలో ఇద్దరు ఉప సర్పంచులు ఎన్నికయ్యారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం.

ఒకే గ్రామంలో ఇద్దరు  ఉపసర్పంచులు..!
ఉండవల్లి ఎంపీడీవో తిరుపతన్నకు ఫిర్యాదు చేస్తున్న మెన్నిపాడు కాంగ్రెస్‌ శ్రేణులు

- రెండవ ఎన్నికను తొలగించాలని మొదటి ఎన్నిక ఉపసర్పంచ్‌ ఫిర్యాదు

అలంపూరు చౌరస్తా, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ప్రజా ఎన్నిక పదవి గ్రామానికి లేదా నియోజకవర్గానికి ఒ క్కటే ఉంటుంది. కానీ ఓ గ్రామంలో ఇద్దరు ఉప సర్పంచులు ఎన్నికయ్యారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. ఉండవల్లి మండలం, మెన్నిపాడు గ్రామంలో 1018 ఓ ట్లు ఉండగా, 8 వార్డులు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ పోరు హోరాహోరీగా జరిగింది. బీఆర్‌ఎస్‌ నుంచి బొబ్బిటి రజిత, కాంగ్రెస్‌ నుంచి ఎద్దుల పారిజాతలు పోటీ చే శారు. 68 ఓట్ల తేడాతో ఎద్దుల పారిజాత వి జయం సాధించింది. కానీ బొబ్బిటి రజిత ప్యా నెల్‌ నుంచి పోటీ చేసిన 8 వార్డు సభ్యులలో 5మంది విజయం సాధించారు. కౌంటింగ్‌ పూ ర్తయ్యాక ఎన్నికల అధికారి ఉప సర్పంచు ఎ న్నికకు ఆహ్వానించారు. 8వ వార్డు సభ్యుడు అబ్రహం ఎన్నికకు కోరం ఏర్పడటంతో ఉపస ర్పంచు పదవీ ఆమోదం పొందింది. దీంతో ఎ న్నికల అధికారి అబ్రహంకు ధ్రువీకరణ ప త్రం అందజేశారు. కాసేపటికి బయట ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఈ విషయం తెలియడం తో ఐదుగురు వార్డు సభ్యులం గెలిచినా తమ వర్గం కాకుండా కోరం లేని వర్గాన్ని ఎలా ఎ న్నిక చేస్తారంటూ బ్యాలెట్‌ బాక్సులు తీసుకె ళ్తున్న బస్సును అడ్డగించారు. దీంతో ఉప స ర్పంచు ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణు లు శాంతించారు. ఉదయం ఎన్నికల అధికా రులు వచ్చి కాంగ్రెస్‌ ప్యానెల్‌లోని సభ్యులకు, సర్పంచుకు కబురు పెట్టారు. కానీ వారు అం దుబాటులో లేకపోవడంతో కోరం ఉన్నందు ను మరోసారి బీఆర్‌ఎస్‌ ప్యానెల్‌లో గెలిచిన వార్డుసభ్యుడైన పరశురాములును ఎన్నుకు న్నారు. దీంతో ఉపసర్పంచి ఎన్నిక వివాదానికి దారి తీసింది. మా ఎన్నికను రద్దు చేయకుం డానే రెండవసారి ఎలా ఎన్నిక చేస్తారని, వెం టనే రెండవ ఎన్నికను రద్దు చేయాలని శని వారం ఎంపీడీవో తిరుపతన్నకు, ఆ తర్వాత కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్‌ నాయ కులు మహేంద్రనాయుడు, గిడ్డరెడ్డి, శ్రీపతిరె డ్డి, శ్రీనివాసరెడ్డి తెలిపారు.

కోరం లేకుండానే..

ఎర్రవల్లి, (ఆంధ్రజ్యోతి): ఎర్రవల్లి మండలంలోని పుటాన్‌దొడ్డి గ్రామ ఉపసర్పంచ్‌ ఎన్నికల వార్డు సభ్యుల కోరం లేకుండానే చేశారని శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ అధికారికి గెలుపొందిన వార్డు సభ్యులు నర్సింహులు, మరియమ్మ, రవీంద్రబాబు, భరత్‌కుమార్‌, మద్దిలేటి, ప్రమీల ఫిర్యాదు చేశారు. పుటాన్‌దొడ్డి గ్రామంలో మొత్తానికి పది వార్డు సభ్యులుండగా, ఓటమి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి పద్మమ్మ తరపు 5మంది సభ్యులు గెలుపొందగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ చిన్న నారాయణ తరుపు ఇద్దరు సభ్యులు గెలవగా, మరో అభ్యర్థి సభ్యులు ఇద్దరు, స్వతంత్రంగా ఒకరితో కలిపి పది మంది అయ్యారు. కానీ కోరం లేకుండానే ఉపసర్పంచ్‌ ఎన్నిక చేశారని, దీనిని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందరి వార్డు సభ్యుల సమక్షంలో మెజార్టీ ప్రకారం ఎన్నికను చేయాలని వినతిలో పేర్కొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 11:10 PM