Share News

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:24 PM

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఎక్సైజ్‌ సీఐ వీరారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు
పట్టుపడిన నిందితులు

416 గ్రాములు స్వాధీనం

మహబూబ్‌నగర్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఎక్సైజ్‌ సీఐ వీరారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టాస్క్‌ఫోర్స్‌ సీఐ కవిత ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ - భూత్పూర్‌ బైపాస్‌ రహదారిలో శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్రాంతికుమార్‌ అనే వ్యక్తి వద్ద 4 ప్యాకెట్ల (20 గ్రాములు) గంజాయి లభించింది. అతడిని విచారించగా, భూత్పూర్‌లోని ఒక వెంచర్‌ మ్యాన్‌హోల్‌లో గంజాయి దాచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే భూత్పూర్‌కు చెందిన సయ్యద్‌ రియాజ్‌కు విక్రయించినట్లు తెలపడంతో, అతడి వద్ద 196 గ్రాముల గంజాయి లభించింది. దీంతో ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు ఫోన్లు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఎస్‌ఐ రాజేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 11:24 PM