Share News

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:12 PM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా, పలువురు గాయాలపాలయ్యారు.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
జడ్చర్ల మండలం గంగాపురం వద్ద లారీ ఢీకొన్న సంఘటనలో ధ్వంసమైన పోలీసు వాహనం

- పలువురికి గాయాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా, పలువురు గాయాలపాలయ్యారు. జడ్చర్లలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా, ఒకరు మృతి చెంది.. ముగ్గురు గాయపడ్డారు. ఖిల్లాఘణపురం మండలం షాపూర్‌లో చెట్టును కారు ఢీకొని యువకుడు మృతి చెందాడు. అదేవిధంగా, జడ్చర్ల మండలం గంగాపురం గ్రామ స్టేజీ వద్ద సీఎం కాన్వాయ్‌ని రిసీవ్‌ చేసుకునే క్రమంలో మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వాహనాన్ని గంగాపురం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. డీఎస్పీతో పాటు, డ్రైవర్‌, గన్‌మన్‌లకు గాయాలయ్యాయి.

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని..

జడ్చర్ల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహ నాలు ఢీకొన్న సంఘటన గురువారం మహ బూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని నేతాజీచౌర స్తాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో అక్కడికక్కడే జడ్చర్ల పట్టణానికి చెందిన రవియాదవ్‌(48) మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, అందులో ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నది. జ డ్చర్ల పట్టణంలోని మినీస్టేడియంలో దసరా ఉత్సవాలలో పాల్గొని, బంధువులకు జమ్మి ఇవ్వడానికి తన ద్విచక్రవాహనంపై బయల్దే రాడు. అతడి బైకును చర్లపల్లి గ్రామానికి చెందిన శివయాదవ్‌, ప్రశాంత్‌యాదవ్‌, సం దీప్‌యాదవ్‌లు ద్విచక్రవాహనంపై అతివే గంగా ఢీ కొట్టారని స్థానికులు తెలిపారు. స్పృహకోల్పోయిన రవియాదవ్‌ను చికిత్స కో సం మహబూబ్‌నగర్‌ ఎస్వీఎస్‌ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. మరో ద్విచక్రవాహ నంపై ఉన్న ముగ్గురిలో శివయాదవ్‌కు తీ వ్ర గాయాలు కాగా, హైదరాబాద్‌కు తరలిం చారు. మిగిలిన ఇద్దరు షాద్‌నగర్‌లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన రవియాద వ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు అ శోక్‌యాదవ్‌ సోదరుడు. సంఘటనపై అశో క్‌యాదవ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడ్తున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. కాగా, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆయనను పరామర్శించారు.

చెట్టును కారు ఢీకొని యువకుడు..

ఖిల్లాఘణపురం,(ఆంధ్రజ్యోతి): నాగర్‌క ర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం గౌరారం తండాకు చెందిన ఇస్లావత్‌ సురేష్‌ (21) కా రులో షాపూర్‌ గ్రామ శివారు ప్రాంతం బ స్టాప్‌ సమీపంలో వేగంగా వచ్చి అదుపు త ప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో సురేష్‌ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ను జ్జు నుజ్జుగా మారిన కారును పోలీసులు జే సీబీ సాయంతో బయటకు తీశారు. మృతు డి భార్య వివరాల మేరకు... గురువారం సా యంత్రం తన భర్త సురేష్‌ అడ్డాకుల మం డలం తిమ్మాయిపల్లి తండాలో స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. తిరు గు ప్రయాణంలో స్వ గ్రామానికి వస్తుండగా షాపూర్‌ స్టేజీ మూల మలుపు వద్ద కారు అ దుపు తప్పి చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపారు.

తప్పిన ప్రాణాపాయం

అలంపూరుచౌరస్తా, (ఆంధ్రజ్యోతి): ఉం డవల్లి మండల పరిధిలోని జాతీయ రహదా రిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపా యం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరానికి చెందిన మురళి అనే వ్యక్తి కర్ణాటక నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో కారు ఎడమ భాగం పూర్తిగా దెబ్బతినగా గాయాలతో బయటప డ్డాడు. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రా ణాపాయం తప్పిందని హైవే సిబ్బంది అ న్నారు. గాయపడిన వ్యక్తిని కర్నూలు ఆ సుపత్రికి తరలించారు.

డీఎస్పీ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

- డీఎస్పీతో సహా డ్రైవర్‌, గన్‌మన్‌లకు గాయాలు

- ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తులో ప్రమాదం

జడ్చర్ల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా నిర్వహిస్తున్న బందోబస్తులో ప్రమాదం చో టుచేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురం గ్రామ స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొండారెడ్డిపల్లి నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా మీదు గా కొడంగల్‌కు వెళ్తున్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను రిసీవ్‌ చేసు కునేందుకు జడ్చర్ల నుంచి మిడ్జిల్‌ వైపు వెళ్తున్న మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వాహనాన్ని గంగాపురం వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొ ట్టింది. ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయ బోయి డీఎస్పీ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో డీ ఎస్పీ వెంకటేశ్వర్లుతో పాటు వాహనం డ్రైవర్‌ గౌతాపురం రంగా రెడ్డి, గన్‌మన్‌ శ్రీనివాసులుకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసు వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో పోలీసు వాహనంలోని ఎయిర్‌బెలూన్‌లు ఓపెన్‌ కావడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనలో పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసం అయ్యింది. సంఘటన స్థలం నుంచి లారీ డ్రైవర్‌ పరార య్యాడు. ఈ సంఘటనపై డీఎస్పీ వాహనం డ్రైవర్‌ రంగారెడ్డి ఫి ర్యాదుతో కేసు దర్యాప్తు చేపడ్తున్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు.

డీఎస్పీని పరామర్శించిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

జడ్చర్ల మండలం గంగాపురం గ్రామ సమీపంలో పోలీసు వా హనాన్ని ఢీకొట్టిన సంఘటనలో గాయపడిన మహబూబ్‌నగర్‌ డీ ఎస్పీ వెంకటేశ్వర్లును జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పరా మర్శించారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్‌ ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న డీఎస్పీని పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

Updated Date - Oct 03 , 2025 | 11:13 PM